ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీపై తాజాగా మాజీ సారథి మైకేల్ క్లార్క్ స్పందించాడు. పేసర్ పాట్ కమిన్స్ జట్టును మూడు ఫార్మాట్లలో నడిపించగల సరైన వ్యక్తి అని పేర్కొన్నాడు. సొంతగడ్డపై టీమ్ఇండియాతో సిరీస్ కోల్పోయిన తర్వాత.. టెస్టు కెప్టెన్‌గా టిమ్ పైన్‌ను తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే క్లార్క్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"తదుపరి కెప్టెన్‌గా పాట్ కమిన్స్ పేరును సూచిస్తాను. గత కొన్నేళ్లుగా అతడు మూడు ఫార్మాట్లలో స్థిరంగా రాణిస్తున్నాడు. సారథిగానూ అతడు సరైన వ్యక్తి. న్యూసౌత్ వేల్స్‌కు నాయకత్వం వహించినప్పుడు నేను చూశాను. వ్యూహత్మకంగా వ్యవహరిస్తాడు. అతడు చాలా మంచి వ్యక్తి."