చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. జట్టు యాజమాన్యానికి తన నిర్ణయాన్ని ప్రకటించి.. క్షమించమని అడిగినట్లు తెలిపాడు. అయితే, ఈ విషయంపై ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
సీఎస్కేకు మరో దెబ్బ.. ఐపీఎల్ నుంచి భజ్జీ ఔట్ - హర్భజన్ సింగ్ తాజా వార్తలు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ సారి ఐపీఎల్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండట్లేదని తెలిపాడు.
![సీఎస్కేకు మరో దెబ్బ.. ఐపీఎల్ నుంచి భజ్జీ ఔట్ Harbhajan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8677671-1058-8677671-1599217008672.jpg)
హర్భజన్
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక్కసారి టోర్నీ నుంచి వైదొలిగిన ఆటగాడిని తిరిగి అనుమతించకపోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విషయంపై మరింత స్పష్టత కనిపిస్తోంది.
ఇప్పటికే సురేశ్ రైనా లీగ్ నుంచి తప్పుకున్నాడు. సీఎస్కే సభ్యుల్లో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఫలితంగా శిక్షణ వాయిదా పడింది. ఇప్పుడు భజ్జీ నిర్ణయంతో సీఎస్కేకు మరో ఎదురుదెబ్బ తలిగినట్లైంది.