తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసోలేషన్​లోనే రుతురాజ్​.. ఐపీఎల్​ తొలి​ మ్యాచ్​కు కష్టమే! - ఐపీఎల్​ కరోనా

సీఎస్కే బ్యాట్స్​మన్​ రుతురాజ్​ ఐపీఎల్​ ప్రారంభ​ మ్యాచ్​కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతడు ఇంకా​ ఐసోలేషన్​లోనే ఉన్నాడని జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు.

Gaikwad
రుతురాజ్​

By

Published : Sep 16, 2020, 6:28 PM IST

కొన్నిరోజుల క్రితం కరోనా బారినపడ్డ చెన్నై సూపర్​ కింగ్స్​ యువ బ్యాట్స్​మన్​ రుతురాజ్​ గైక్వాడ్.. ఇంకా​ ఐసోలేషన్​లోనే ఉన్నాడు. దీంతో సెప్టెంబరు 19న ముంబయి ఇండియన్స్​తో జరిగే మ్యాచ్​కు అందుబాటులో ఉండడని జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్​ చెప్పారు. ప్రస్తుతం అతడి​ ఆరోగ్యం బాగానే ఉందని, బయో బబుల్​లో చేరేందుకు బీసీసీఐ నుంచి ఇంకా అనుమతి రాలేదని పేర్కొన్నారు. మరో రెండురోజుల్లో అతడు బబుల్​లోకి అడుగుపెడతాడని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

శిక్షణ శిబిరానికి వెళ్లే ముందు చేసిన కరోనా పరీక్షల్లో.. చెన్నై జట్టులోని ఇద్దరు ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయ సిబ్బందికి పాజిటివ్​గా తేలింది. వీరిలోనే రుతురాజ్​ గైక్వాడ్, దీపక్​ చాహర్​ ఉన్నారు. ఇటీవలే చాహర్​తో పాటు మిగిలిన 11 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

గైక్వాడ్ కూడా రెండురోజుల క్రితం పరీక్షలు చేయించుకోగా, ఫలితాలు రావాల్సి ఉంది. ఇందులో నెగిటివ్​గా​ తేలితేనే అతడికి ఇతర వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు టోర్నీ నుంచి వైదొలిగిన సురేశ్​​ రైనా స్థానంలో గైక్వాడ్​ను తీసుకోవాలని చెన్నై ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ విషయమై ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వనాథన్​ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details