తెలంగాణ

telangana

ETV Bharat / sports

సీఎస్కేకు ఊరట.. వారికి కరోనా నెగిటివ్!

కరోనా కలకలంతో సీఎస్కేలోని మిగతా ఆటగాళ్లు, సిబ్బందికి నిర్వహించిన వైరస్​ నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది. వీరందరికి మరోసారి పరీక్షలు నిర్వహించి.. అందులో నెగిటివ్​ రిపోర్టు వస్తే ప్రాక్టీస్​ సెషన్​కు అనుమతిస్తారు.

CSK
సీఎస్కే

By

Published : Sep 1, 2020, 5:02 PM IST

Updated : Sep 1, 2020, 5:14 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో క్రికెటర్లు రుతురాజ్​ గైక్వాడ్​, దీపక్​ చాహర్​ సహా 13 మంది సిబ్బంది కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మిగతా ఆటగాళ్లు సహా సిబ్బందికి వైరస్​ నిర్ధరణ పరీక్షలు చేయగా.. వారికి నెగిటివ్​గా తేలింది. దీంతో ఇప్పటికే ఇబ్బందులతో సతమతమవుతోన్న సీఎస్కేకు కాస్త ఊరట లభించినట్లైంది.

అయితే వీరికి మరోసారి సెప్టెంబరు 3న పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది ఫ్రాంచైజీ. ఇందులో నెగిటివ్​గా తేలితేనే మైదానంలో ప్రాక్టీస్టు సెషన్​కు​ అనుమతిస్తామని వెల్లడించింది. అనంతరం వీరిని బయోబబుల్​ వాతావరణంలోకి అనుమతిస్తారు.

కాగా ఇప్పటికే తన తల్లి అనారోగ్యం వల్ల సీనియర్​ క్రికెటర్​ హర్భజన్​ సింగ్​ దుబాయ్​కు రాలేదు. అయితే ఇతడు యూఏఈకి చేరుకుని జట్టులో చేరడానికి మరికొన్ని రోజులు పడుతుందని స్పష్టం చేసింది యాజమాన్యం. ఇప్పటికే జట్టు వైస్​ కెప్టెన్​ సురేశ్​ రైనా వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఐపీఎల్​కు దూరమయ్యాడు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఈ మెగాలీగ్​ జరగనుంది.

Last Updated : Sep 1, 2020, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details