చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్ సహా 13 మంది సిబ్బంది ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో మిగతా ఆటగాళ్లు సహా సిబ్బందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయగా.. వారికి నెగిటివ్‌గా తేలింది. తాజాగా సెప్టెంబర్ 3న(గురువారం) వారికి మరోసారి పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించి రిపోర్టులు నేడు రాత్రి లేదా సెప్టెంబరు 4వ తేదీన వస్తాయి. ఈ పరీక్షల్లోనూ నెగిటివ్ వస్తే జట్టుకు ఊరట లభిస్తుంది. అప్పుడు ఆటగాళ్లు శుక్రవారం నుంచి ప్రాక్టీసు సెషన్లో ఆటగాళ్లు పాల్గొంటారు.
శుక్రవారం నుంచి సీఎస్కే ట్రైనింగ్ షురూ! - సీఎస్కేకు కరోనా పరీక్షలు
కరోనా కలకలంతో సీఎస్కేలోని మిగతా ఆటగాళ్లు, సిబ్బందికి సెప్టెంబరు 3న(గురువారం) రెండో రౌండ్ వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో నెగిటివ్‌గా తేలితే వారిని సెప్టెంబరు 4 నుంచి ప్రాక్టీసు సెషన్‌కు అనుమతిస్తారు.
సీఎస్కే
కాగా ఇప్పటికే తన తల్లి అనారోగ్యం వల్ల సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ దుబాయ్‌కు రాలేదు. అయితే ఇతడు యూఏఈకి చేరుకుని జట్టులో చేరడానికి మరికొన్ని రోజులు పడుతుందని స్పష్టం చేసింది యాజమాన్యం. ఇప్పటికే జట్టు వైస్ కెప్టెన్ సురేశ్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఈ మెగాలీగ్ జరగనుంది.
ఇది చూడండి ధోనీ 'పబ్జీ' ఆపేసి ఆ గేమ్ ఆడుతున్నాడట!