చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానులకు శుభవార్త! ఆ జట్టులో అత్యధిక పరుగుల వీరుడు సురేశ్‌రైనాను వచ్చే సీజన్‌కు అట్టిపెట్టుకుంటుందని సమాచారం. అతడితో ఒప్పందాలేవీ రద్దు చేసుకోలేదని తెలుస్తోంది. ముంబయిలో అతడు అరెస్టైనప్పటికీ తమ ఉద్దేశంలో మార్పేమీ లేదని ఫ్రాంచైజీ వర్గాలు అంటున్నాయి.
"‘రైనా మాతోనే ఉంటాడు. అతడితో విడిపోయేందుకు ప్రణాళికలేమీ లేవు. ముంబయిలో అరెస్టుకు సంబంధించిన వార్తలు మేం చదివాం. దాంతో మాకు అవసరం లేదు. అతడు మాతోనే కొనసాగుతాడు."
--- సీఎస్‌కే అధికారి
కరోనా వైరస్ వల్ల ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించారు. చెన్నై ఆటగాళ్లతో దుబాయ్‌కి చేరుకున్న రైనా.. వ్యక్తిగత కారణాలతో తిరిగి స్వదేశానికి వచ్చాడు. లీగ్‌లో పాల్గొనలేదు. ఫ్రాంచైజీ యాజమాన్యంతో విభేదాలే ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అతడిని శ్రీనివాసన్ ఘాటుగా విమర్శించాడు. రైనా క్షమాపణలు చెప్పడం వల్ల అంతా చల్లబడినట్టు తెలిసింది. క్రమశిక్షణా నియమాలు ఉల్లంఘించిన కారణంగా వచ్చే సీజన్లో అతడిని సీఎస్‌కే అట్టిపెట్టుకోదని, అతడితో ఒప్పందాలు రద్దు చేసుకుందని వార్తలు వచ్చాయి.
ఇదీ చూడండి:వచ్చే ఏడాది ఐపీఎల్ మెగావేలం లేనట్టే