ఐపీఎల్ కోసం సిద్ధమవుతోంది చెన్నై సూపర్ కింగ్స్. ప్రాక్టీస్ కోసం బుధవారం ముంబయికి చేరుకున్న సీఎస్కే ఆటగాళ్లు ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా ఈ జట్టుకు నెట్ బౌలర్‌గా కొత్త ఆటగాడిని తీసుకున్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన ఫజల్లా ఫరూకీని నెట్స్‌లో బౌలింగ్ చేయడానికి ఎంపిక చేశారు. ఇతడు అఫ్గాన్ నుంచి ముంబయికి బయలుదేరాడు. ఈ విషయాన్ని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.
సీఎస్కే నెట్ బౌలర్‌గా అఫ్గాన్ పేసర్ ఫరూకీ - ఫజల్లా ఫరుకీ నెట్ బౌలర్
ఐపీఎల్లో పాల్గొనేందుకు సన్నాహకాలు ప్రారంభించింది చెన్నై సూపర్ కింగ్స్. తాజాగా ప్రాక్టీస్‌లో నెట్స్‌లో బౌలింగ్ చేయడానికి మరో ఆటగాడిని తీసుకుంది. అఫ్గాన్‌కు చెందిన ఫజల్లా ఫరూకీని జట్టులో చేర్చుకుంది.
![సీఎస్కే నెట్ బౌలర్‌గా అఫ్గాన్ పేసర్ ఫరూకీ CSK net bowler](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11153692-200-11153692-1616665174404.jpg)
ఫరూకీ
20 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ పేసర్ ఈ నెల ప్రారంభంలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఓ వికెట్ తీసుకున్నాడు. ఇందులో అఫ్గాన్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.