తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ రిటైర్మెంట్ తీసుకోవడానికి అదీ ఓ కారణం! - dhoni 2019 world cup

ధోనీ​ వీడ్కోలు విషయంలో మీడియా పాత్ర కూడా ఉందని చెప్పారు అతడి చిన్ననాటి కోచ్ కేశవ్. వారు చేసిన విమర్శలు, మహీ రిటైర్మెంట్​కు ఓ కారణమని తెలిపారు.

ధోనీ రిటైర్మెంట్ తీసుకోవడానికి అదీ ఓ కారణం!
ధోనీ కోచ్ కేశవ్ రంజన్

By

Published : Aug 16, 2020, 5:58 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్​కు మీడియాలో వస్తున్న విమర్శలు ఓ కారణమని అన్నారు మహీ చిన్నప్పటి కోచ్ కేశవ్ రంజన్ బెనర్జీ. ఏడాది నుంచి ఆడని క్రికెటర్.. జట్టులోకి ఎలా రీఎంట్రీ ఇస్తాడు అని వాళ్లు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు.

ధోనీ చిన్నప్పటి కోచ్ కేశవ్​తో ఇంటర్వ్యూ

"2019 ప్రపంచకప్​ తర్వాత ధోనీ కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. భారత జట్టులోకి ఎలా రీఎంట్రీ ఇస్తాడు? అంటూ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు ధోనీ రిటైర్మెంట్​కు కారణమేమో. మహీ నిర్ణయం తీసుకోవడంలో ఇది ఓ భాగమై ఉండొచ్చు. ఆ విషయం అతడికి మాత్రమే తెలుసు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ వరకు ఆడే ఫిట్​నెస్ ధోనీలో ఉందని నా అభిప్రాయం. నేను కాదు చాలామంది ఇదే అనుకుంటున్నారు. అయితే అందరూ వీడ్కోలు పలకాల్సిన సమయం ఉంటుంది. ధోనీ రిటైర్మెంట్​పై నేను బాధపడ్డా. అదే సమయంలో నా ఎమోషన్స్​ను కంట్రోల్ చేసుకున్నా."

-కేశవ్ రంజన్ బెనర్జీ, ధోనీ చిన్ననాటి కోచ్

పాఠశాలలో ఫుట్​బాల్ ప్లేయర్​గా ఉన్న ధోనీని క్రికెట్ ఆడుతావా? అంటూ వికెట్​ కీపర్​గా మార్చిన ఘనత కోచ్ కేశవ్​కే దక్కుతుంది. ఈయన వల్లే మనం ఇన్నేళ్ల పాటు మిస్టర్ కూల్​ను క్రికెట్​లో చూడగలిగాం.

అదే విధంగా ధోనీ 7వ నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని అన్నారు కోచ్ కేశవ్. టీమ్​ఇండియా ఈ నంబర్ జెర్సీని ఎవరికీ ఇస్తుందనుకోవట్లేదని చెప్పారు. మహీ ఓ దిగ్గజం అని, 7వ నంబర్ జెర్సీ అతడి సొంతమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details