టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా, శనివారం తన పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తన కళ్లను దానం చేయనున్నట్లు ప్రకటించారు. ఇలాంటి వాటి కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.
"దేవుడి దయ వల్ల నా శరీరంలో ప్రతి అవయవం ఉంది. అందుకే నేను ఎలాంటి బాధ అనుభవించలేదు. కానీ, నేను నా కళ్లను దానం చేయడం ద్వారా ఇబ్బందులు పడేవారికి సహాయం చేసినట్లు అవుతుంది. దీనివల్ల ఏ విధమైన అనుభూతి పొందుతున్నానో ఇప్పుడు వివరించలేను. కానీ, ఈ నిర్ణయం నాకు సంతృప్తినిచ్చింది. మన మరణం తర్వాత కూడా మరొకరికి ఉపయోగపడేలా ఉండాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా"