బయో బబుల్ వల్ల పశ్చిమ దేశాలకు చెందిన క్రికెటర్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని పాకిస్థాన్ ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ అభిప్రాయపడ్డాడు. ఈ విధానంలో ఆట కొనసాగితే వారికి ఆ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదముందని చెప్పాడు.
"బయో బబుల్‌లో క్రికెట్ ఇంకా కొనసాగితే ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది మానసిక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముంది. అయితే మా(పాక్) క్రికెటర్లు మాత్రం మానసికంగా చాలా ఆరోగ్యవంతులు, బబుల్‌కు బాగా అలవాటుపడిపోయారు. ఇదే విధానం ఇంకొన్నాళ్లు ఉంటే పశ్చిమ దేశాలకు చెందిన ఆటగాళ్లు, సిబ్బంది మాత్రం మానసికంగా ఇబ్బంది పడొచ్చు" -మిస్బా ఉల్ హక్, పాక్ ప్రధాన కోచ్