కోల్‌కతా జట్టు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పెళ్లి చేసుకున్నాడు. అతి కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో తన ప్రేయసితో ఏడడగులు వేశాడు. అయితే ఈ విషయాన్ని వరుణ్ వెల్లడించలేదు. అతడి స్నేహితుడు అరుణ్ కార్తిక్ ఇన్‌స్టాలో వరుణ్ పెళ్లి ఫొటో షేర్ చేయడం వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది.
ప్రేయసిని పెళ్లాడిన భారత మిస్టరీ స్పిన్నర్ - Varun Chakravarthy team india
యువ బౌలర్ వరుణ్ చక్రవర్తి.. ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసిని మనువాడాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితుడు ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు.
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లో కోల్‌కతా తరఫున ఆడిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన చేశాడు. దిల్లీతో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 6.84 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు.
బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని బంతులు వేసే అతడు.. ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. కానీ గాయంతో అతడు పర్యటనకు దూరమయ్యాడు. ఆ స్థానంలో జట్టులోకి వచ్చిన నటరాజన్ సత్తాచాటాడు. అయితే ప్రతిభకు కొదవలేని వరుణ్.. త్వరలోనే భారత జట్టులోకి వస్తాడని సీనియర్ క్రికెటర్లు ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది భారత్‌లోనే టీ20 ప్రపంచకప్ జరుగుతుండటంతో లెగ్ స్పిన్నర్ చక్రవర్తి కీలకమవుతాడని విశ్లేషిస్తున్నారు.