రాజస్థాన్‌లోని జలూర్ జిల్లా పర్యటనలో భాగంగా.. ఓ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాల్గొన్నాడు. ధోనీని చూడడానికి అభిమానులు తరలిరావడం వల్ల అక్కడ రద్దీ నెలకొని.. తొక్కిసలాట జరిగింది. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ధోనీ హాజరైన కార్యక్రమంలో తొక్కిసలాట- లాఠీఛార్జ్! - పాఠశాల ప్రారంభోత్సవంలో ధోనీ
రాజస్థాన్‌లోని ఓ పాఠశాల ప్రారంభోత్సవంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పాల్గొన్నాడు. ధోనీని చూసేందుకు అభిమానులు తరలిరావడం వల్ల తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.
ధోనీ హాజరైన కార్యక్రమంలో తొక్కిసలాట- లాఠీఛార్జ్!
ఈ నేపథ్యంలో వచ్చిన పని పూర్తి కాకముందే ధోనీ అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుఖ్రామ్ బిష్ణోయ్, ఎంపీ దేవ్జీ పటేల్ హాజరయ్యారు.
ఇదీ చూడండి:కరోనా టీకా తొలి డోసు తీసుకున్న కపిల్‌దేవ్
Last Updated : Mar 3, 2021, 10:28 PM IST