మొన్న జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిశారు. క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సిరాజ్‌ను శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన క్రికెటర్ సిరాజ్ - మమ్మద్ సిరాజ్ వార్తలు
భారత క్రికెట్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సిరాజ్‌ను మంత్రి అభినందించి సన్మానించారు.
![మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన క్రికెటర్ సిరాజ్ cricketer mahamad siraj met with sports minister srinivas goud in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10328297-thumbnail-3x2-siraj.jpg)
శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన క్రికెటర్ సిరాజ్
సిరాజ్ భవిష్యత్‌లో భారత జట్టుకు ఆణిముత్యం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో తీసుకవచ్చేలా కృషి చేయాలని సిరాజ్‌కు సూచించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి:సిరీస్‌లో తీసిన ప్రతి వికెట్ నాన్నకు అంకితం: సిరాజ్
Last Updated : Jan 21, 2021, 7:54 PM IST