తెలంగాణ

telangana

ETV Bharat / sports

బెన్​స్టోక్స్​.. 'ప్లేయర్​ ఆఫ్​ ద ఇయర్​' - ప్రపంచకప్​ హీరో స్టోక్స్

ఇంగ్లాండ్​ క్రికెటర్​​ బెన్​స్టోక్స్​ను మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ప్రొఫెషనల్​ క్రికెటర్స్​ అసోసియేషన్​(పీసీఏ) ప్రతి ఏటా ఇచ్చే 'ప్లేయర్​ ఆఫ్​ ద ఇయర్'​ పురస్కారం ఇతడి సొంతమైంది.

ఇంగ్లాండ్​ క్రికెటర్​​ బెన్​స్టోక్స్

By

Published : Oct 3, 2019, 2:28 PM IST

ఇంగ్లాండ్​ ప్రపంచకప్​ హీరో, ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్ మరో ​పురస్కారం గెల్చుకున్నాడు. ప్రొఫెషనల్​ క్రికెటర్స్​ అసోసియేషన్​(పీసీఏ) నుంచి ఈ ఏడాది 'ప్లేయర్​ ఆఫ్​ ద ఇయర్'​గా నిలిచి, అవార్డు అందుకున్నాడు. సిమన్​ హర్మర్​, ర్యాన్​ హిగ్గిన్స్​, డామ్​ సిబ్లేలతో లాంటి వారితో స్టోక్స్​ నామినేట్​ అయినా.. చివరికి ఓటింగ్​ ద్వారా అతడినే పురస్కారం వరించింది.

అవార్డుతో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్​ స్టోక్స్

"ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆనందంతో మాటలు రావట్లేదు. ప్రపంచకప్​ ఆడిన తర్వాత అందరూ నన్ను చాలా గొప్పగా చూస్తున్నారు. నా ప్రదర్శనకు పీసీఏ 'ప్లేయర్​ ఆఫ్​ ద అవార్డు' ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఓట్లు వేసి నన్ను ఎంపిక చేయడం వ్యక్తిగతంగా చాలా గౌరవంగా భావిస్తున్నా'. --బెన్​స్టోక్స్​, ఇంగ్లాండ్​ క్రికెటర్​

సోమర్​సెట్స్​కు చెందిన టామ్​ బాంటన్​కు​ 'యంగ్​ ప్లేయర్​ ఆఫ్​ ద ఇయర్'​ అవార్డు దక్కింది. ఇంగ్లాండ్​కు చెందిన మహిళా క్రికెటర్​ సోఫీ ఎక్లేస్టోన్​కు 'ఉమన్ ప్లేయర్​ ఆఫ్​ ద సమ్మర్' పురస్కారం లభించింది.

ఇదే వేదికపై 'వన్డే ప్లేయర్​ ఆఫ్​ ద సమ్మర్​' అవార్డును క్రిస్​ వోక్స్​ అందుకోగా...'టెస్ట్​ ప్లేయర్​ ఆఫ్​ ద సమ్మర్​'గా స్టువర్ట్​ బ్రాడ్​, 'కంట్రీ ఛాంపియన్​షిప్​ 'ప్లేయర్​ ఆఫ్​ ద ఇయర్'​గా హర్మర్​ నిలిచారు.

ఈ ఏడాది జులైలో న్యూజిలాండ్​తో జరిగిన ప్రపంచకప్​ ఫైనల్లో బెన్​స్టోక్స్...​​ ఇంగ్లాండ్​ కప్పు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవల ముగిసిన యాషెస్​ చివరి టెస్టులోనూ 135 పరుగులు చేసి ఓటమి అంచున ఉన్న మ్యాచ్​ను గెలిపించాడు. ఈ సిరీస్​ డ్రా అయింది.

ఇది చదవండి: సఫారీలపై రోహిత్- మయాంక్ రికార్డు భాగస్వామ్యం

ABOUT THE AUTHOR

...view details