తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రపంచకప్​.. కోట్లాది భారతీయుల గుండెచప్పుడు' - ప్రపంచకప్​ 2019

ప్రపంచకప్​లో టీమిండియాను ఉత్సాహపరుస్తూ... క్రికెట్​ అభిమానుల ఆకాంక్షలకు అద్దం పడుతూ.. ఓ యువ బృందం గీతాన్ని రూపొందించింది. ఈ పాట యూట్యూబ్​లో క్రికెట్​ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

'ప్రపంచకప్​... కోట్లాది భారతీయుల గుండెచప్పుడు'

By

Published : Jun 5, 2019, 2:57 PM IST

ప్రపంచకప్​ను క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.130మంది కోట్లభారతీయులు ప్రపంచకప్​ను కోహ్లీసేన గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. అభిమానుల ఆశలు, భారీ అంచనాల నడుమ నేడు మెగాటోర్నీలో భారత జట్టు పోరాటం ఆరంభించింది. తొలి మ్యాచ్​ను దక్షిణాఫ్రికాతో ఆడుతోంది.ఈ సందర్భంగా 'కప్ మనదే.. వరల్డ్​కప్ మనదే' అంటూ సాగే ఓ గీతం యూట్యూబ్​లో అందరినీ అలరిస్తోంది. అభిమానుల ఆకాంక్షలకు అద్దం పడుతోంది. ఉత్తేజపరుస్తోంది.

న్యూక్లియర్ పవర్​ కార్పొరేషన్​లో సైంటిఫిక్ అధికారిగా పనిచేస్తున్న ఫణికృష్ణఈ గీతంలో నటించారు. అర్మాన్ శర్మ, కృష్ణ సంగీతాన్ని అందించారు. విన్ను జయంత్ దర్శకత్వం వహించారు. కరీంనగర్, ముంబయిలో చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటను కెనడాలోని ఓ స్టూడియోలో రూపొందించారు. టీమిండియాను ప్రోత్సాహపరిచేలా ఉన్న ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. .

ఇది చదవండి: 'వారు లేకున్నా సౌతాఫ్రికా బలమైన ప్రత్యర్థే' అంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details