తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా దెబ్బతో క్రికెటర్లకు కష్టాలు.. జీతాల్లో సగం కోత

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో పడిన వెస్టిండీస్​ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం ప్రకటించింది. ఆటగాళ్లు, సిబ్బంది జీతాల్లో సగం కోత విధించనున్నట్లు తెలిపింది. జులై నెల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Cricket West Indies
కరోనా దెబ్బతో క్రికెటర్లకు కష్టాలు.. జీతాల్లో సగం కోత

By

Published : May 30, 2020, 5:28 PM IST

వెస్టిండీస్​ క్రికెట్ బోర్డు ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే జులైలో ఇంగ్లాండ్​ పర్యటనకు అంగీకరించిన బోర్డు.. తాజాగా ఆటగాళ్లు, సిబ్బంది జీతాల్లో కోత విధించేందుకు సిద్ధమైంది. దీనిపై చర్చలు నిర్వహించిన బోర్డు అధికారులు.. జులై నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇది మూడు లేదా ఆరు నెలల పాటు కొనసాగిస్తామని.. తర్వాత నుంచి పూర్తి వేతనం ఇస్తామని స్పష్టం చేశారు.

"ప్రసుతం అంతర్జాతీయంగా ఎలాంటి క్రికెట్​ మ్యాచ్​లు లేకపోవడం వల్ల ఆయా​ బోర్డులకు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. విండీస్​ క్రికెట్ బోర్డు కూడా అదే పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇది భవిష్యత్తుపైనా ప్రభావం చూపించవచ్చు. అయితే దేశవ్యాప్తంగా క్రికెట్​ కమ్యూనిటిలో పనిచేస్తున్న అందిరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని నిర్ణయించాం. అందుకే వేతనంలో కోత తప్పట్లేదు. రానున్న ఆరు నెలల్లో సాధారణ పరిస్థితులు వస్తే మళ్లీ జీతంపై నిర్ణయం ప్రకటిస్తాం."

-విండీస్​ క్రికెట్​ బోర్డు

జులై​లో సిరీస్​...!

ఇంగ్లాండ్ పర్యటనకు విండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం ఆమోదముద్ర వేసింది. పూర్తిస్థాయిలో సురక్షితమైన వాతావరణంలో తమ బృందం ఆడుతుందని తెలిపింది. జూన్ నెలలో విండీస్-ఇంగ్లాండ్‌ మధ్య మూడు టెస్ట్‌లు జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సిరీస్‌ను జులై మొదటి వారానికి వాయిదా వేశారు. జులై 8, 16, 24 తేదీల్లో హ్యాంప్​షైర్, ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు ప్రయాణిస్తారని.. ఆటగాళ్లు, సిబ్బందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తామని విండీస్​ బోర్డు తెలిపింది.

ఇదీ చూడండి: విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్​ సాధ్యమేనా?

ABOUT THE AUTHOR

...view details