టీమిండియా ఆటగాళ్లపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు జల్లు కురిపించాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారని అన్నాడు. ఫిట్‌నెస్ లేకపోతే ఏ ఫార్మాట్‌లోనూ రాణించేలేరని తెలిపాడు.
"గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం భారత ఆటగాళ్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారు. గతంలో ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. కానీ టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత క్రికెట్ ఫిటెనెస్‌తో కూడిన ఆటగా మారింది. నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు టీ20 ఫార్మాట్ లేదు. అప్పట్లో క్రికెట్ అంటే ఫిట్‌నెస్ కంటే సాంకేతికమైన ఆటగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు ఫిట్‌నెస్ లేనిది ఏ ఫార్మాట్‌లోనూ ఎవరూ రాణించలేరు."
- గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్
భారత మహిళా జట్టు గొప్పగా ఆడుతోందని, ఇది దేశానికి శుభసూచకమని గంభీర్ అన్నాడు.