రఫేల్ యుద్ధ విమానాల రాకతో భారత వాయు సేన (ఐఏఎఫ్) సామర్థ్యం మరింత పెరిగిందని టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. వాయుసేన పైలట్ల చేతుల్లోకి ప్రబల శక్తిగల పక్షులు (విమానాలు) చేరడం వల్ల విధ్వంసకర, ప్రాణాంతక పరిస్థితుల్ని ఎదుర్కొనే సత్తా మరింత పెరుగుతుందన్నాడు.
"తుది ప్రవేశ కార్యక్రమంతో ప్రపంచపు అత్యుత్తమ యుద్ధ విమానంగా నిరూపితమైన 4.5 జనరేషన్ ఫైటర్ ప్లేన్ పైలట్ల చేతుల్లోకి చేరింది. దీంతో భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరుగుతుంది. ప్రతిష్ఠాత్మక 17 స్క్వాడ్రన్ (గోల్టెన్ యారోస్)కు శుభాకాంక్షలు, మిరేజ్ 2000 సర్వీస్ రికార్డును రఫేల్ అధిగమించాలని మనమంతా ఆశిద్దాం. కానీ ఎస్‌యూ30ఎంకేఐ నాకు చాలా ఇష్టం. అయినా ఇప్పుడు పైలట్లకు భీకర పోరుకు సిద్ధమవ్వడానికి కొత్త లక్ష్యం సమకూరింది. ఇవి సూపర్ సుఖోయ్‌గా అప్‌గ్రేడ్ అయ్యే వరకు బీవీఆర్ ఎంగేజ్‌మెంట్ కోసం ఎదురుచూడాలి."
-ధోనీ, టీమ్ఇండియా మాజీ సారథి.