తెలంగాణ

telangana

ETV Bharat / sports

'లసిత్ మలింగ... ఓ మ్యాచ్ విన్నర్'

శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ అంతర్జాతీయ వన్డే క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఈ విషయంపై  ట్విట్టర్​లో స్పందించిన టీమిండియా ఆటగాళ్లు.. అతడు గొప్ప బౌలర్​ అంటూ ప్రశంసించారు.

మలింగ

By

Published : Jul 27, 2019, 5:44 PM IST

మలింగ.. ఈ పేరు వినగానే ఉంగరాల జట్టు.. విభిన్న బౌలింగ్ శైలి గుర్తుకొస్తాయి. తన కెరీర్​లో ఎన్నో రికార్డులు, జ్ఞాపకాలను సంపాదించుకుని వన్డే క్రికెట్​కు వీడ్కోలు పలికాడీ లంక బౌలర్. బంగ్లాదేశ్​తో శుక్రవారం జరిగిన మ్యాచ్​తో తన వన్డే కెరీర్​ను ముగించాడు. అతడి రిటైర్మెంట్​పై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు టీమిండియా క్రికెటర్లు.

"ఈ పదేళ్ల ముంబయి ఇండియన్స్​ ప్రయాణంలో మ్యాచ్‌ విన్నర్‌ ఎవరని అడిగితే... సమాధానం లసిత్ మలింగనే. క్లిష్ట పరిస్థితుల్లో నాకు ఎంతో సాయం చేశాడు. వైవిధ్యమైన బంతుల్ని సంధిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భవిష్యత్తులో అతడికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా". -రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్

రోహిత్ శర్మ ట్వీట్

"నీ బౌలింగ్‌ స్పెల్‌ క్లాసిక్‌. క్రికెట్‌కు నీవు చేసిన అద్భుతమైన సేవలకు ధన్యవాదాలు. నువ్వంటే నాకు ఎల్లప్పుడూ అభిమానమే, దాన్ని అలానే కొనసాగిస్తాను."
-బుమ్రా, టీమిండియా ఆటగాడు

బుమ్రా ట్వీట్

"అద్భుతమైన నీ వన్డే కెరీర్​కు అభినందనలు. భవిష్యత్తులో నీకు అంతా మంచి జరగాలని ఆశిస్తున్నా". -సచిన్ తెందూల్కర్, టీమిండియా మాజీ క్రికెటర్

బంగ్లాదేశ్​తో జరిగిన ఈ వన్డేలో 9.4 ఓవర్లు వేసిన మలింగ.. 38 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

15 ఏళ్ల వన్డే కెరీర్​లో 329 మ్యాచ్​లు ఆడి 536 వికెట్లు పడగొట్టాడు మలింగ. యార్కర్ స్పెషలిస్టుగా పేరు సంపాదించాడు. వన్డే క్రికెట్​లో మూడు హ్యాట్రిక్​లు సాధించిన ఏకైక బౌలర్​గా రికార్డు సృష్టించాడు. 2011లో టెస్టు క్రికెట్​కు మలింగ వీడ్కోలు పలికాడు.

ఇవీ చూడండి.. వీడ్కోలు మ్యాచ్​ చివరి బంతికి మలింగ వికెట్​

ABOUT THE AUTHOR

...view details