ఐసీసీ ప్రపంచకప్ 2019 టోర్నీ క్రికెట్ అభిమానులైన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. తుదిపోరులో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అవ్వగా.. ఆ తర్వాత నిర్వహించిన సూపర్ ఓవర్ స్కోర్లూ సమం కావడం వల్ల నిర్వాహకులే ఆశ్చర్యానికి గురయ్యారు. చివరికి బౌండరీ కౌంట్ ద్వారా ఆ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఆతిథ్య జట్టునే విజేతగా ప్రకటించారు.
అయితే ఈ మెగా ఈవెంట్లో కొంతమంది మహిళా వాఖ్యాతలూ పాలుపంచుకున్నారు. ప్రతి మ్యాచ్‌కు ముందు, తర్వాత వివిధ విశ్లేషణల ద్వారా ప్రేక్షకులకు మరింత సమాచారాన్ని అందించారు. వారిలో కొంతమంది..
- భారత్‌కు చెందిన రిధిమా పాఠక్.. ఈమె బలమైన స్వరంతో ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి చెందింది.
- పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ క్రీడాకారిణి జైనబ్ అబ్బాస్.. ఇప్పటికే అనేక అంతర్జాతీయ టోర్నీల్లో వాఖ్యాతగా ఉండటం సహా పాక్‌లో పలు క్రికెట్ షోలనూ నిర్వహించింది.
- అఫ్ఘానిస్థాన్‌కు చెందిన దివా పతంగ్.. నేషనల్ రేడియా టెలివిజన్ ఆఫ్ అఫ్ఘానిస్థాన్ (ఆర్టీఏ)లో స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా పనిచేస్తోంది.
ఈ ముగ్గురు క్రీడా వాఖ్యాతలు ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఐసీసీ 2019 ప్రపంచకప్ అనుభవాలను పంచుకున్నారు. ఈ టోర్నీతో వారందరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడిందని వెల్లడించారు. దీంతో పాటు ప్రపంచకప్‌నకు సంబంధించిన కొన్ని విశేషాలను ఈ సందర్భంగా వెల్లడించారు.
లాక్డౌన్ సమయాన్ని ఎలా గడిపారు?
జైనబ్ అబ్బాస్:ఇంతకుముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఎక్కడికి వెళ్లినా.. వాళ్లతో కలిసి వెళ్లేదాన్ని. కానీ, ప్రస్తుతం నేను ఇంటికే పరిమితమయ్యా. లాక్డౌన్ వల్ల కొన్ని లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి. ఏదేమైనా చివరికి క్రికెట్ తిరిగి ప్రారంభమైంది.
దివా పతంగ్: ప్రస్తుతం ప్రపంచమంతా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పుడు నేను లండన్‌లో ఉన్నా. ఇక్కడ నుంచి పనిచేయడం చాలా కష్టం.