తెలంగాణ

telangana

ETV Bharat / sports

99 ఏళ్ల మాజీ క్రికెటర్​తో సచిన్​-వా సందడి - undefined

దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు స్టీవ్​ వా... 99 ఏళ్ల మాజీ క్రికెటర్​ను కలిశారు. రంజీల్లో పెద్ద వయస్కుడైన వసంత్​ రైజీ చేత 100 నవంబరు ఉన్న కేక్​ కోయించారు.

Cricket Legends Sachin Tendulkar and Waugh visit 99-year-old Ranji player Vasant Raiji House
99 ఏళ్ల మాజీ క్రికెటర్​తో సచిన్​-వా సందడి

By

Published : Jan 14, 2020, 9:39 AM IST

ప్రస్తుతం జీవించి ఉన్న మాజీ రంజీ ఆటగాళ్లలో పెద్ద వయస్కుడైన వసంత్‌ రైజీని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవా వా కలిశారు. 99 ఏళ్ల వసంత్‌ను కలిసేందుకు సచిన్‌, స్టీవ్‌ దక్షిణ ముంబయిలోని అయన ఇంటికి వెళ్లారు.

వసంత్​ రైజీ

త్వరలో సెంచరీ..

ఈ నెల 26న సెంచరీ(వయసు) కొట్టనున్నారు వసంత్‌. అప్పటి బాంబే జింఖానా మైదానంలో టీమిండియా స్వదేశంలో తొలి టెస్టు మ్యాచ్‌ (1933) ఆడినప్పుడు అయన వయసు 13 ఏళ్లు. 1940ల్లో తొమ్మిది ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 277 పరుగులు చేశారు. ఇందులో 68 వ్యక్తిగత అత్యధికం.

క్రికెట్​ కెరీర్​ ముగిసిన తర్వాత వసంత్​ రచయితగా స్థిరపడ్డారు​. దాదాపు ఇప్పటివరకు 10 పుస్తకాలు రాశారు. 'ద రొమాన్స్​ ఆఫ్​ ద రంజీ ట్రోఫీ', 'ఇండియా హంబుల్డన్​ మ్యాన్​' వంటి పుస్తకాలు మంచి పేరు తెచ్చాయి.

వసంత్​ రైజీ రాసిన పుస్తకం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details