జాతివివక్ష సమస్యను పరిష్కరించడానికి ఫుట్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్ నిర్వహకులు చాలా తక్కువ శ్రద్ధ చూపిస్తారని మాజీ క్రికెటర్ రోనాల్డ్ బుట్చేర్ అభిప్రాయపడ్డాడు. ఫుట్‌బాల్ క్లబ్బులు జాతివివక్ష పట్ల కఠినంగా వ్యవహరిస్తాయని తెలిపాడు.
'జాతివివక్ష నిర్మూలనకు క్రికెట్లో చర్యలేవి?' - Racism in Cricket
క్రికెట్‌తో పోలిస్తే ఫుట్‌బాల్‌లో జాతివివక్షను రూపుమాపడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ రోనాల్డ్ బుట్చేర్. క్రీడల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా క్లబ్బులు కఠినంగా వ్యవహరిస్తున్నాయని తెలిపాడు. క్రికెట్లో అలాంటి చర్యలు తీసుకునే వారే కరవయ్యారని వెల్లడించాడు బుట్చేర్.
!['జాతివివక్ష నిర్మూలనకు క్రికెట్లో చర్యలేవి?' Cricket has really said nothing to racism, says Roland Butcher](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7919905-1068-7919905-1594047385596.jpg)
"క్రీడల్లో జాతివివక్షను రూపుమాపడానికి క్రికెట్ కంటే ఫుట్‌బాల్ ఎక్కువగా శ్రద్ధ చూపిందని నేను చెప్పగలను. ఫుట్‌బాల్ ఆటగాళ్లు చాలా చురుకైనవారు. ఈ విషయంపై క్రికెట్ బోర్డులు నిశబ్దంగా ఉన్నాయే తప్ప.. ఈ సమస్యను రూపుమాపడానికి తగిన చర్యల గురించి ఎలాంటి స్పందన లేదని భావిస్తున్నా. అయితే క్రికెట్లో నాపై నేరుగాఅసభ్యకరంగా కామెంట్ చేయలేదు. కానీ, కొంతమందికి జాతివివక్ష కామెంట్లు ఎదురయ్యాయని నాకు తెలుసు" అని అన్నాడు రోనాల్డ్ బుట్చేర్.
1980-81లో క్రికెట్లో అడుగుపెట్టిన రోనాల్డ్ బుట్చేర్.. ఇంగ్లాండ్ తరపున మూడు టెస్టులు, మూడు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించిన తొలి నల్లజాతీయుడిగా బుట్చేర్ ఘనత సాధించాడు.