తెలంగాణ

telangana

ETV Bharat / sports

దివాలా బాటలో క్రికెట్​ బోర్డులు

ప్రపంచదేశాలను దెబ్బతీసిన కొవిడ్​ వైరస్​ ప్రభావం క్రికెట్​ కార్యకలాపాలపైనా తీవ్రంగానే ఉంది. పలు ద్వైపాక్షిక సిరీస్​లు ఆగిపోవడం ఆయా దేశాల క్రికెట్​ బోర్డుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి.

CRICKET Boards in bankruptcy
దివాలా బాటలో క్రికెట్​ బోర్డులు

By

Published : Apr 19, 2020, 7:14 AM IST

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ కార్యకలాపాలు ఆగిపోవడం వివిధ దేశాల బోర్డులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు సిరీస్‌లు రద్దు కావడంతో బోర్డులు ఆర్థిక సంక్షోభంలో పడబోతున్నాయి. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ బోర్డుల్ని పక్కనబెడితే బంగ్లాదేశ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, జింబాబ్వే, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా దేశాల క్రికెట్‌ బోర్డు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కనీసం మరో ఆరు నెలల పాటు క్రికెట్‌ జరిగే అవకాశాలు లేకపోవడంతో అవి దివాలా తీసే పరిస్థితులు తలెత్తుతాయంటున్నారు క్రికెట్‌ విశ్లేషకులు.

లంక, పాక్‌, విండీస్‌ బోర్డులతో టెన్‌ స్పోర్ట్స్‌ ప్రసార హక్కుల ఒప్పందం ఇప్పటికే ముగియగా.. సుమారు రూ.140 కోట్లతో బంగ్లాదేశ్‌ చేసుకున్న ఆరేళ్ల ఒప్పందం కూడా ఏప్రిల్‌తో ముగియనుంది. శ్రీలంక, పాక్‌, వెస్టిండీస్‌ కూడా ప్రసార వ్యవహారాల్లో ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నాయి. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ను మధ్యలోనే ఆపేయడం వల్ల పీసీబీ ఆదాయానికి ఇప్పటికే భారీగా గండి పడింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపడుతుందో అని బోర్డులు వేచి చూస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details