తెలంగాణ

telangana

ఆస్ట్రేలియా ఫస్ట్​క్లాస్​ క్రికెట్​ కోసం ఆ బంతి

ఈ ఏడాది ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో డ్యూక్స్​ బంతికి బదులుగా కూకబుర్రాను ఉపయోగించనున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గతేడాది షెఫీల్డ్​ టోర్నీలో స్పిన్నర్లు బాగా రాణించలేకపోవడం వల్లే బంతిని మార్చాలనుకున్నట్లు ఆ దేశ క్రికెట్​ బోర్డు ఆపరేషన్స్​ హెడ్​ పీటర్​ రోచ్​ తెలిపారు.

By

Published : Jul 2, 2020, 3:31 PM IST

Published : Jul 2, 2020, 3:31 PM IST

Cricket Australia to not use Dukes ball in first-class cricket from 2020-21 season
ఆస్ట్రేలియా ఫస్ట్​క్లాస్​ క్రికెట్​ కోసం కూకబుర్రా బంతి

ఈ వేసవిలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే షెఫీల్డ్ ​షీల్డ్​లో డ్యూక్స్​ బంతికి బదులుగా కూకబుర్రాను ఉపయోగించాలని క్రికెట్​ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించింది. ఇప్పటికే నాలుగు సీజన్లులో కూకబుర్రా బంతులను వినియోగించగా.. 2020-21లో జరిగే ఫస్ట్​క్లాస్​ మొత్తం సీజన్​కు ఆ బంతిని ఉపయోగిస్తామని సీఏ ప్రకటించింది. ఈ విషయంపై సీఏ ఆపరేషన్స్​ హెడ్​ పీటర్​ రోచ్​ మాట్లాడారు.

"డ్యూక్​ బంతిని ప్రవేశపెట్టడం విలువైనదే. ముఖ్యంగా యాషెస్​ సిరీస్​ వరకు డ్యూక్స్ బంతిని​ ఇంగ్లాండ్​ వాళ్లు బాగా ఉపయోగిస్తున్నారు. గత నాలుగు సీజన్లలో ఈ బంతితో ఆస్ట్రేలియా ప్రదర్శనపై మేం సంతృప్తిగా ఉన్నాం. అయితే 2020-21 సీజన్​లో కూకబుర్రా బంతి, ఆటగాళ్లకు నిలకడగా ఆడేందుకు ఉపయోగిపడుతుందని భావిస్తున్నాం. గత సీజన్​లో షెఫీల్డ్​ టోర్నీలో స్పిన్నర్లు డ్యూక్స్​ బంతితో రాణించలేకపోయారని గుర్తించాం. దీంతో ఆ బంతిని మార్చాలని అనుకున్నాం. ఇది సానుకూల ప్రయోజనం కలిగిస్తుందని ఆశిస్తున్నాం"

- పీటర్​ రోచ్​, క్రికెట్ ఆస్ట్రేలియా ఆపరేషన్స్​ హెడ్​

డ్యూక్స్​ బంతిని తిరిగి సరైన సమయంలో వాడుకలోకి తెస్తామని క్రికెట్​ ఆస్ట్రేలియా తెలిపింది. ఇంగ్లాండ్​ పరిస్థితులను అలవాటు చేసుకోవాలనే లక్ష్యంతో 2016-17 సీజన్​ నుంచి డ్యూక్స్​ బంతులను ఉపయోగిస్తుంది ఆసీస్.

ABOUT THE AUTHOR

...view details