ఆటగాళ్లు ఒత్తిడిని జయించేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) మానసిక వైద్య నిపుణులను నియమించేందుకు సిద్ధమైంది. గతేడాది ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో సహా ముగ్గురు ఆటగాళ్లు ఒత్తిడితో క్రికెట్‌కు కొంత కాలం దూరమయ్యారు. ఈ నేపథ్యంలో సీఏ నిపుణుల నియామకంపై నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం గతవారమే ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బందికి.. మద్దతు, మంచి వాతావరణాన్ని అందించడమే ప్రధాన లక్ష్యమని బోర్డు అధికారులు తెలిపారు.
క్రికెటర్ల కోసం మానసిక వైద్య నిపుణుల నియామకం!
ఆటగాళ్ల కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మానసిక వైద్య నిపుణులను నియమించాలని నిర్ణయించింది. గతేడాది కొంతమంది క్రికెటర్లు మానసిక ఒత్తిడి కారణంగా క్రికెట్ నుంచి విరామం తీసుకున్నారు. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని బోర్డు ప్రకటించింది.
ప్రస్తుతం బోర్డులో ఆటగాళ్ల కోసం ఇద్దరు సైకాలజిస్టులు ఉన్నారు. వారిలో మైకేల్ లాయిడ్ పురుషుల జట్టు కోసం సేవలందిస్తుండగా.. పీటర్ క్లార్క్ మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గతేడాది.. మ్యాక్స్‌వెల్ వ్యక్తిగత సమస్యల కారణంగా క్రికెట్ నుంచి కొంతకాలం విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మన్ నిక్ మాడిసన్, విల్ పుకోవ్స్కీ కూడా ఈ బాటలోనే వెళ్లారు. ఈ క్రమంలోనే క్రికెటర్ల మానసిక సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ చర్చల అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిపుణుల నియామకానికి ఆమోదముద్ర వేసింది.