ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేస్తే.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్ మధ్య ఈ మెగాటోర్నీ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రవాణా ఆంక్షల కారణంగా ఈ టోర్నీ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.
"అక్టోబర్-నవంబర్ నాటికి పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నాం. ఒకవేళ టోర్నీ జరగకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రూ.400 కోట్లపైనే నష్టం వాటిల్లే ప్రమాదముంది.