కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడాటోర్నీలను వాయిదా వేయగా.. మరికొన్ని రద్దయ్యాయి. దీనితో సంబంధం లేకుండా పురుషుల టీ20 ప్రపంచకప్‌ను యథావిధిగా నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. దీనిపై ఆ బోర్డు అధ్యక్షుడు కెవిన్ రాబర్ట్స్ స్పందించారు.
"కొద్ది రోజుల్లోనే తిరిగి మళ్లీ క్రీడా టోర్నీలు ప్రారంభమవుతాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ, ఈ ఏడాది పురుషుల టీ20 ప్రపంచకప్ జరిగే అక్టోబర్-నవంబర్ సమయానికి సాధారణ వాతావరణం నెలకొంటుందని భావిస్తున్నాం. నవంబర్ 15న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ నిర్వహిస్తాం. ఆ మ్యాచ్‌కు స్టేడియం మొత్తం నిండిపోయి.. మహిళల టీ20 కంటే గొప్ప స్పందన వస్తుందని ఆశిస్తున్నాం ."