తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​తో చివరి రెండు టెస్టు వేదికల్లో మార్పు! - సిడ్నీలో కరోనా కేసులు

టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడు, నాలుగో టెస్టు వేదికలు మార్పు చేసే అవకాశం ఉందని ఆ దేశ వార్తాసంస్థలు నివేదించాయి. మూడో టెస్టు జరగాల్సిన సిడ్నీలో కరోనా కేసులు పెరగడం వల్లే ఈ మార్పులు చేయడానికి క్రికెట్​ ఆస్ట్రేలియా సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.

Cricket Australia contemplates swapping 3rd and 4th Tests after COVID surge in Sydney
భారత్​Xఆస్ట్రేలియా: చివరి రెండు టెస్టుల వేదిక మార్పు!

By

Published : Dec 20, 2020, 11:29 AM IST

Updated : Dec 20, 2020, 12:46 PM IST

టీమ్​ఇండియాతో జరగనున్న చివరి రెండు టెస్టుల వేదికలను మార్పు చేసేందుకు క్రికెట్​ ఆస్ట్రేలియా సన్నాహాలు చేస్తోంది. సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో జనవరి 7న అక్కడ నిర్వహించబోయే టెస్టు వేదికను బ్రిస్బేన్​కు మార్పు చేసే అవకాశం ఉంది.

"క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రకారం జనవరి 7 నుంచి 11 వరకు సిడ్నీలో మూడో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మూడు, నాలుగో టెస్టు వేదికలను మార్చుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మూడో టెస్టును బ్రిస్బేన్​లో, నాలుగో మ్యాచ్​ను సిడ్నీలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి" అని స్థానిక వార్తాసంస్థలు నివేదించాయి.

బాక్సింగ్​ డే టెస్టుకు రెడీ!

ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​, పేసర్​ సీన్​ అబాట్​లు గాయాల నుంచి దాదాపుగా కోలుకున్నారు. టీమ్​ఇండియాతో డిసెంబరు 26 నుంచి జరగనున్న బాక్సింగ్​డే టెస్టులో పాల్గొనేందుకు వీరిద్దరూ శనివారం సిడ్నీ నుంచి మెల్​బోర్న్​కు చేరుకున్నారు.

పలు రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు

సిడ్నీలోని ఆరోగ్య అధికారులతో కలిసి ప్రస్తుత పరిస్థితిని క్రికెట్​ ఆస్ట్రేలియా పర్యవేక్షిస్తోంది. ఇటీవలే కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న కారణంగా విక్టోరియా, సౌత్​ ఆస్ట్రేలియా రాష్ట్రాలు సరిహద్దుల వద్ద ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. ప్రస్తుతం న్యూ సౌత్​ వేల్స్​ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త ఆంక్షలను విధించింది. ఈ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న క్వీన్స్​ల్యాండ్​ సరిహద్దులను మూసివేసే ఆలోచనలో ఆ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే సిడ్నీ, బ్రిస్బేన్​ టెస్టులు నిర్వహించే అవకాశం ఉండకపోవచ్చు.

అడిలైడ్​ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా, టీమ్​ఇండియా మధ్య జరిగిన తొలి టెస్టులో ఆసీస్​ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్​లో 1-0 తేడాతో కంగారూలు ఆధిక్యంలో నిలిచారు.

ఇదీ చూడండి:సిడ్నీలో కరోనా కేసులు.. మూడో టెస్టుపై నీలినీడలు!

Last Updated : Dec 20, 2020, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details