బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత టెస్టుకు పెర్త్ స్టేడియాన్ని వేదికగా ప్రకటించకపోవడంపై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్ట్స్ స్పందించాడు. ఈ విషయంపై బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవలే వెల్లడించాడు.
"ఎనిమిదేళ్లలో మొత్తం ఇంగ్లాండ్ ఆడిన నాలుగు టెస్టులకు, భారత్ ఆడిన రెండు టెస్టులకు పెర్త్ ఆతిథ్యమిచ్చింది. ఇప్పటివరకు బ్రిస్బేన్ కేవలం రెండింటికి మాత్రమే వేదికైంది. దీన్ని సమానం చేసేందుకు టీమ్ఇండియాతో ఆడే తొలి టెస్టును బ్రిస్బేన్లో నిర్వహించాలని భావించాం. వేదికల ఎంపిక అనేది పర్యటనల ప్రణాళికలపై ఆధారపడి ఉంటుంది. క్రీన్స్లాండ్లోని క్రికెట్ అభిమానులకు దృష్టిలో ఉంచుకొని ఉన్నతస్థాయి టెస్టు మ్యాచ్లను నిర్వహిస్తామని భరోసా ఇచ్చాం. ఆ స్టేడియానికి ప్రేక్షకుల రాక మరింత పెరుగుతుందని ఊహించే, ఈ నిర్ణయం తీసుకున్నాం"