టీమ్ఇండియాతో ఈ ఏడాది జరగాల్సిన నాలుగు టెస్టుల సిరీస్ను కచ్చితంగా నిర్వహించాలనుకుంటోంది క్రికెట్ ఆస్ట్రేలియా. దాని కోసం కరోనా వల్ల కలిగే అనిశ్చితిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ముఖ్యనిర్వహణ అధికారి కెవిన్ రాబర్డ్స్ తెలిపారు.
క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తోంది. దీంతో భారత్తో టెస్టు సిరీస్ నిర్వహణ వల్ల ప్రసార హక్కులతో వచ్చే దాదాపు రూ.15 వందల కోట్లతో ఆర్థిక లోటును భర్తీ చేసుకోవాలని సీఏ యోచిస్తోంది. ప్రణాళిక ప్రకారం ఈ టోర్నీ నవంబరు 2020 నుంచి జనవరి 2021 మధ్య జరగాల్సి ఉంది.
"ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి లేదని నేను భావిస్తున్నా. ఏదీ ఏమైనా భారత పర్యటన వాయిదా పడితే నేను నిజంగా ఆశ్చర్యపోతా. భవిష్యత్లో ఏమి జరుగుతుందో చూడాలి".