ఈ అక్టోబరులో వెస్టిండీస్‌తో జరగాల్సిన టీ20 సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం ప్రకటించింది. దీనికి విండీస్ బోర్డు కూడా అంగీకరించింది.
వెస్టిండీస్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ వాయిదా - AUS vs WI
కరోనా వ్యాప్తి కారణంగా వెస్టిండీస్‌తో జరగాల్సిన టీ20 సిరీస్‌ను వాయిదా వేసింది ఆస్ట్రేలియా బోర్డు. ఇదే కారణంతో ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ను వచ్చే ఏడాది నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
![వెస్టిండీస్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ వాయిదా Cricket Australia announces postponement of T20I series against Windies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8286035-thumbnail-3x2-hd.jpg)
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ వాయిదా వేసిన ఆస్ట్రేలియా
"టీ20 ప్రపంచకప్ ముందు వెస్టిండీస్‌తో మూడు టీ20లు ఆడేందుకు షెడ్యూల్ చేశాం. కానీ, కరోనావ్యాప్తి, టీ20 ప్రపంచకప్ వాయిదాతో ఈ సిరీస్‌ను వాయిదా వేయాలని నిర్ణయించాం" అని ఆస్ట్రేలియా బోర్డు చెప్పింది.
టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తూ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటన చేసింది. దీంతో సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల ద్వైపాక్షిక సిరీస్‌ను ప్లాన్ చేసింది ఆస్ట్రేలియా. మరోవైపు అదే నెల 19 నుంచి ఐపీఎల్‌ను యూఏఈలో జరిపేందుకు సిద్ధమవుతోంది బీసీసీఐ.