క్రికెట్లో ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పించే విధంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అడుగులు వేయనుంది. ఈ విషయాన్ని గురువారం ఆ దేశ క్రీడా విభాగం తెలిపింది. ఆటలో లింగభేదం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగానే దేశ క్రికెట్ బోర్డు నియమాల్లో మార్పులు చేయాలనుకుంటోంది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)నీ సంప్రదించనున్నట్లు పేర్కొంది.
"క్రికెట్లో ఎలాంటి లింగ భేదం ఉండకూడదు. అంతర్జాతీయ, జాతీయ టోర్నీల్లో మరింత నిష్పాక్షికంగా ఆట జరగాలని కోరుతున్నాం. ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పించి వారిని క్రికెట్లో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనలో ఉన్నాం."
-- ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రతినిధి.
ఈ తాజా నిర్ణయాన్ని ఆ దేశ మహిళా క్రికెటర్ మేగనా స్కట్ అభినందించింది. సరికొత్త విధానానికిఆసీస్ తొలి అడుగు వేయడంపై హర్షం వ్యక్తం చేసింది.