ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు పర్యటన పూర్తి షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గురువారం ప్రకటించింది. పర్యటనలో టీమ్ ఇండియా.. టెస్టులు, వన్డేలతో పాటు టీ20 సిరీస్ కూడా ఆడనుండడం కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాకు గొప్ప ఊరటే. టెస్టు, టీ20, వన్డే సిరీస్‌ల ద్వారా సుమారు రూ.1500 కోట్లు ఆర్జించాలన్నది సీఏ లక్ష్యం. షెడ్యూల్ ప్రకారం అక్టోబరులో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ఆసీస్‌లో కోహ్లీసేన పర్యటన ప్రారంభం కానుంది.
తొలి మ్యాచ్ అక్టోబరు 11న జరుగుతుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబరు 3న ఆరంభమయ్యే మొదటి టెస్టుకు బ్రిస్బేన్ ఆతిథ్యమివ్వనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జనవరి 17న జరిగే మూడో మ్యాచ్‌తో ఆసీస్‌లో టీమ్‌ఇండియా పర్యటన ముగుస్తుంది.
టీ20 సిరీస్‌కు తొలి టెస్టు ఆరంభానికి మధ్య నెలన్నర రోజుల విరామం ఉంది. ఈ సమయంలో షెడ్యూలు ప్రకారం ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగాల్సివుంది. కానీ వాయిదా పడడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. ఐపీఎల్‌కు మార్గం సుగమవుతుందని భావిస్తున్నారు. జనవరిలో ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా మహిళల జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ కూడా జరుగనుంది.
ఆసీస్‌లో భారత్.. టీ20 సిరీస్:
- తొలి టీ20 : అక్టోబరు 11, బ్రిస్బేన్
- రెండో టీ20 : అక్టోబరు 14, కాన్‌బెర్రా
- మూడో టీ20 : అక్టోబరు 17, అడిలైడ్