క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బంగాల్ (సీఏబీ) కార్యాలయంలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆఫీస్‌ను వారంపాటు తాత్కాలికంగా మూసేస్తున్నామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో ఓ కాంట్రాక్టు ఉద్యోగికి వైరస్ సోకిందని వారు తెలియజేశారు.
"సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో చందన్ దాస్ అనే కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నాడు. అతను శాశ్వత ఉద్యోగి కాదు. అతడికి కరోనా సోకింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారం రోజులుగా అతడు విధులకు హాజరు కాకపోయినా.. వైద్యుల సలహా మేరకు వారం రోజులపాటు తాత్కాలికంగా సీఏబీ కార్యాలయాన్ని మూసేయాలని నిర్ణయించాం".