కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 10 వరకు జరగనుంది. ఆరుజట్ల మధ్య మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తారౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు చెందిన క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
కేవలం రెండు స్టేడియాల్లోనే సీపీఎల్ నిర్వహణ - cpl league news updates
వచ్చే నెల నుంచి కరీబియన్ ప్రీమియర్ లీగ్ మొదలుకానుంది. కేవలం రెండు స్టేడియాల్లోనే నిర్వహించనున్నారు. వ్యక్తిగత కారణాలతో క్రిస్ గేల్.. ఈ సీజన్‌కు దూరం కానున్నాడు.
సీపీఎల్
టోర్నమెంటు బయో సెక్యూర్ వాతావరణంలో జరగనుందని సీపీఎల్ సీఈఏ డామియన్ తెలిపారు. కఠిన నిబంధనలు విధించామని, టోర్నీలో పాల్గొనే క్రికెటర్ల ఆరోగ్యమే తమకు తొలి ప్రాధాన్యమని అన్నారు. సుదీర్ఘ విరామం రావడం వల్ల ఆటగాళ్లంతా మంచి ఆకలితో ఉన్నారని, కాబట్టి ఈసారి సీపీఎల్ మరింత రసవత్తరంగా ఉండనుందని చెప్పారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో లీగ్ నిర్వహణకు సాయం చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Last Updated : Jul 28, 2020, 1:55 PM IST