తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనాపై పోరుకు రోహిత్ 80 లక్షల విరాళం - Rohit Sharma donates Rs 80 lakh to Corona fight

కరోనాపై పోరుకు మద్దతుగా విరాళాలు ప్రకటించి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు టీమ్​ఇండియా క్రికెటర్లు. తాజాగా రోహిత్ శర్మ 80 లక్షలు విరాళంగా ప్రకటించాడు.

రోహిత్
రోహిత్

By

Published : Mar 31, 2020, 12:00 PM IST

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వైరస్​పై పోరుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపడుతున్నాయి. వారికి మద్దతుగా సెలిబ్రిటీలు తమవంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. టీమ్​ఇండియా క్రికెటర్లు విరాళాలు ప్రకటిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా రోహిత్ శర్మ 80 లక్షలు విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపాడు.

ఇందులో 45 లక్షలు ప్రధానమంత్రి ప్రారంభించిన పీఎమ్ కేర్స్​ నిధికి, 25 లక్షలు మహారాష్ట్ర ప్రభుత్వ సహాయనిధికి, 5 లక్షలు ఫీడింగ్ ఇండియా ఆర్గనైజేషన్​కు, మరో 5 లక్షలు వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్​కు అందజేస్తున్నట్లు తెలిపాడు.

రోహిత్ ట్వీట్

ఇప్పటికే సురేశ్ రైనా 52 లక్షలు విరాళం ప్రకటించగా, బీసీసీఐ 51 కోట్లు పీఎమ్ కేర్స్​ నిధికి విరాళమిచ్చింది. సచిన్ తెందుల్కర్ 50 లక్షలు ప్రకటించాడు. వీరితో పాటు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, టీమ్​ఇండియా సారథి కోహ్లీ, స్ప్రింటర్ హిమదాస్, షట్లర్ పీవీ సింధు, రెజ్లర్ భజరంగ్ పునియా తమవంతు సాయం చేశారు.

ABOUT THE AUTHOR

...view details