ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత క్రికెటర్లకు గురువారం తొలి రౌండ్ కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఫిబ్రవరి 2న సాధన ఆరంభించడానికి ముందు ఆటగాళ్లు మరో రెండు సార్లు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాల్సివుంటుంది. భారత క్రికెటర్లంతా ఇప్పుడు లీలా ప్యాలేస్ హోటల్లో బయో బబుల్‌లో ఉన్నారు. వాళ్లు తమ గదులకే పరిమితం కావాల్సివుంటుంది.
టీమ్ఇండియా క్రికెటర్లకు కొవిడ్ నెగెటివ్ - టీమ్ఇండియా క్రికెటర్లకు కొవిడ్ నెగెటివ్
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో భారత ఆటగాళ్లకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. టీమ్ఇండియా క్రికెటర్లంతా ప్రస్తుతం చెన్నైలోని లీలా ప్యాలేస్ హోటల్లో బయో బబుల్‌లో ఉన్నారు.
టీమ్ఇండియా క్రికెటర్లకు కొవిడ్ నెగెటివ్
అయితే క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉండేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే వైస్ కెప్టెన్ రహానె, ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, వికెట్‌కీపర్ సాహాలతో వారి వారి కుటుంబ సభ్యులు కలిశారు.