తెలంగాణ

telangana

ETV Bharat / sports

లాక్​డౌన్​లో సరికొత్త లుక్​తో దర్శనమిచ్చిన కపిల్​ - సచిన్​ హెయిర్​ కట్​

కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్​డౌన్​ కొనసాగుతోంది. దీంతో సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఇంటివద్దే కుటుంబంతో గడుపుతున్నారు. తాజాగా మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్​ దేవ్​ తన కొత్త లుక్​ను ట్విట్టర్​లో పంచుకున్నారు.

COVID-19: Kapil Dev sports new look amid lockdown, shaves head
లాక్​డౌన్​లో సరికొత్త లుక్​తో దర్శనమిచ్చిన కపిల్​దేవ్​

By

Published : Apr 21, 2020, 1:43 PM IST

లాక్​డౌన్​ కారణంగా తన జుట్టును తానే స్వయంగా కత్తిరించుకున్న చిత్రాలను సచిన్​ పోస్ట్​ చేసిన తర్వాత.. భారత లెజండరీ ఆల్​రౌండర్​ కపిల్​దేవ్​ తన సరికొత్త లుక్​ తాలూకా ఫొటోలను ట్విట్టర్​లో ఉంచారు. అందులో గుండుతో, కళ్లద్దాలు, నల్ల కోటు వేసుకుని తాను ఎప్పుడూ కనిపించని రూపంలో దర్శనమిచ్చారు.

ప్రపంచమంతా కరోనా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో మానవాళి మనుగడ కోసం ప్రజలంతా సహకరించాలని కపిల్​ ప్రజలను కోరారు. లాక్​డౌన్​కు సహకరిస్తూ అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఈ వైరస్​ నియంత్రణకు పౌరులంతా మమేకమై ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలను పాటించి.. సురక్షితంగా ఉండాలని విన్నవించారు.

కపిల్​ దేవ్​
కపిల్​ దేవ్​

సచిన్​ ఇటీవల తన జుట్టును తానే కత్తిరించుకున్న చిత్రాలను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నారు. అది ఎలా ఉందో చెప్పాలని అభిమానులను అడిగారు. "స్క్వేర్ కట్స్‌ ఆడటం నుంచి నా హెయిర్‌ కట్స్‌ వరకు చేస్తున్నా. భిన్నంగా చేసే ప్రతిదాన్ని ఆస్వాదిస్తున్నా. నా కొత్త హెయిర్‌ స్టైల్ ఎలా ఉంది?" అని పోస్ట్ చేశారు.

ఇదీ చూడండి.. కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉంది: సచిన్

ABOUT THE AUTHOR

...view details