బిగ్‌బాష్ లీగ్‌లోని ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కట్టుదిట్టమైన నిబంధనలు ప్రవేశపెట్టింది. హెయిర్ కట్ కోసం ఆటగాళ్లు బయోబబుల్‌ను దాటి బయటకు వెళ్లకుండా నిషేధం విధించింది. సిడ్నీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ తరహా ఆంక్షలు విధించింది.
లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్లకు హెయిర్ కట్ కష్టమే! - హెయిర్ కట్ బిగ్‌బాష్ లీగ్
కరోనా కట్టడిలో భాగంగా బిగ్‌బాష్ లీగ్‌లో నిబంధనలను కఠినతరం చేశారు. హెయిర్ కట్ లాంటి వ్యక్తిగత అవసరాల కోసం ఆటగాళ్లెవరూ బయోబబుల్‌ను దాటి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది.
![లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్లకు హెయిర్ కట్ కష్టమే! COVID-19 Impact: CA bans haircuts of Big Bash players](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9989793-393-9989793-1608799047889.jpg)
'హెయిర్ కట్ కోసం వెళ్లడానికి వీల్లేదు'
క్వీన్స్‌లాండ్‌లో బిగ్‌బాష్ నిబంధనల ప్రకారం.. హెయిర్ కట్ లాంటి వ్యక్తిగత పనులు కోసం బయటకు వెళ్లేందుకు ఆటగాళ్లకు అనుమతి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అవసరాల కోసం ఇతరులను లోపలకు అనుమతి ఇస్తే మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. బయట నుంచి వచ్చే ఆహార పదార్థాలపై ఆంక్షలు విధించింది ఆసీస్ బోర్డు.