తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా ప్రభావం.. ఐసీసీ వీడియో కాన్ఫరెన్స్​ సమావేశం - ఐసీసీ సమావేశాలు

అంతర్జాతీయ క్రికెట్ మండలి సమావేశాలకు కరోనా దెబ్బ తగిలింది. తాజాగా జరగాల్సిన సమావేశాలు మే నెలకు వాయిదాపడ్డాయి. సత్వరం నిర్ణయం తీసుకునే అంశాలపై మాత్రం ఈనెల చివరి వారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు.

ICC
ICC

By

Published : Mar 13, 2020, 8:41 AM IST

కరోనా వైరస్​ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి సమావేశాలు జరిగే వీలు లేకుండా పోయింది. అందువల్ల వీటిని కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈనెల చివరి వారంలో (26-29) దుబాయ్ వేదికగా ఈ మీటింగ్ జరగనుంది.

ఇందులో సత్వరం నిర్ణయం తీసుకునే అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. పూర్తి షెడ్యూల్ సమావేశాలు మే నెలకు వాయిదాపడ్డాయి.

ఇవీ చూడండి: భారత్‌-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్​లు​ ఖాళీ స్టేడియాల్లోనే!

ABOUT THE AUTHOR

...view details