కరోనా కారణంగా క్రీడలకు గడ్డుకాలం నడుస్తోంది. టోర్నీలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియట్లేదు. క్రికెట్ సిరీస్ల ప్రారంభానికి సమయం పట్టేలా ఉంది. అయితే ఒకవేళ ప్రారంభమైనా ఆటలో కొన్ని మార్పులు కనిపించనున్నాయి. అందులో ఒకటి బంతి మెరుపు కోసం బౌలర్ దానికి ఉమ్మి రాయడం. దీనిపై చర్చించేందుకు సిద్ధమైంది ఐసీసీ. దానికి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. అందులో ఒకటి కృత్తిమ పదార్థంతో బంతిని రుద్ది మెరుపు తీసుకురావడం.
"కృత్తిమ పదార్థం ద్వారా బంతికి మెరుపు తీసుకొచ్చేందుకు ఒక అవకాశం ఉంది. అంపైర్ల సమక్షంలో ఆటగాడు ఆ పదార్థాన్ని ఉపయోగించి బంతికి మెరుపు తీసుకురావచ్చు. దీనిపై ఐసీసీ కూడా ఆలోచిస్తోంది." అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో సంస్థ తెలిపింది.