కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో జరిగే సూపర్లీగ్నూ వాయిదా వేశారు. ఈ లీగ్ ఫ్రాంచైజీ కరాచీ కింగ్స్ ఆటగాడు అలెక్స్ హేల్స్ చేసిన మెసేజ్‌తో ఆ దేశ క్రికెట్ బోర్డు భయాందోళనకు గురైందట. ఈ విషయాన్ని ఆ జట్టు యజమాని సల్మాన్ ఇక్బాల్ తెలిపాడు.
ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభం కారణంగా పాకిస్థాన్ సూపర్‌లీగ్-2020 వాయిదా వేశారు. అందులో పాల్గొనడానికి పాక్ వెళ్లిన ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ తిరిగి స్వదేశానికి రావాలనే పిలుపుతో ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఓ మెసేజ్ రూపంలో "బాస్.. నాలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి" అని రాత్రి 2 గంటలకు కరాచీ కింగ్స్ యజమాని సల్మాన్‌కు సమాచారం అందించాడు. ఈ విషయాన్ని సల్మాన్ ఇక్బాల్ తాజాగా వెల్లడించాడు.