బీసీసీఐ జనరల్ మేనేజర్ సబా కరీం తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇటీవలే కరీమ్ పనితీరు పట్ల బోర్డు సభ్యులు అసంతృప్తి చెందడం, ఈ నేపథ్యంలో బోర్డుకు అతనికి మధ్య విభేదాలు కూడా వచ్చినట్లు వార్తులు గుప్పుమన్నాయి. ఈ కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అయితే ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు.
బీసీసీఐ జనరల్ మేనేజర్ సబా కరీం రాజీనామా! - బీసీసీఐ సాబా కరీం రాజీనామా
భారత క్రికెట్ బోర్డులో మరో కీలక పదవి ఖాళీ కానుంది. జనరల్ మేనేజర్‌గా ఉన్న సబా కరీం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. బోర్డు, అతనికి మధ్య విభేదాలు ఉండటమే కారణంగా తెలుస్తోంది.

సాబా కరీం
2017 డిసెంబరులో సీఈఓ రాహుల్ జోహ్రీ నేతృత్వంలో.. కరీమ్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దేశవాళీ క్రికెట్ సహా ఇతర విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యతలో కొనసాగారు కరీం. ఇటీవల సీఈవో పదవికి రాహుల్ జోహ్రీ రాజీనామా చేయగా.. బీసీసీఐ ఆమోదించింది. ఈ క్రమంలోనే కరీం కూడా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇది చూడండి : హంగేరియన్ గ్రాండ్ ప్రిలో హామిల్టన్‌కు పోల్ పొజిషన్