తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ ఏం చేస్తాడో తెలుసా?

రిటైరైన తర్వాత వంట చేస్తానని అంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని, వివిధ రకాల వంటకాలను రుచి చూస్తుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

విరాట్ కోహ్లీ

By

Published : Nov 11, 2019, 6:31 AM IST

విరాట్ కోహ్లీ.. ఫిట్​నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. కఠోరమైన కసరత్తులు చేసే టీమిండియా కెప్టెన్.. తిండి విషయంలో జాగ్రత్తలు పాటించినప్పటికీ.. ఇంకా తాను ఫుడీనేనని చెబుతున్నాడు. పంజాబీ వంటకాలైన రజ్మా చావల్, బట్టర్ చికెన్, నాన్​లను ఇష్టంగా తింటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు రిటైరైన తర్వాత కుకింగ్​పై శ్రద్ధ పెడతానని తెలిపాడు.

"చిన్నతనం నుంచి నేను ఆహారప్రియుణ్ని. నా బ్యాగులో ఎంతో జంక్​ఫుడ్ ఉండేది. ప్రయాణాల్లో వివిధ రకాల వంటకాలను రుచి చూసేవాడిని. బాగా ఉడికించిన ఫుడ్ అంటే ఎంతో ఇష్టం. ఎలా వండాలో తెలియనప్పటికీ వంట రుచిని, దాన్ని ఎంత బాగా వండింది ఇట్టే పసిగట్టేవాణ్ని. క్రికెట్‌ నుంచి రిటైర్ అయ్యాక నేను తప్పకుండా వంట నేర్చుకుంటాను" - విరాట్ కోహ్లీ, టీమిండియా క్రికెటర్.

బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​కు విశ్రాంతి తీసుకున్నాడు కోహ్లీ. నవంబరు 14 నుంచి ఆ జట్టుతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్​కు సారధ్యం వహించనున్నాడు. ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా భార్య అనుష్కతో కలిసి భుటాన్ సందర్శించాడు.

ఇదీ చదవండి: చాహర్​​ దెబ్బకు బంగ్లా హడల్​.. భారత్​దే సిరీస్​

ABOUT THE AUTHOR

...view details