స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన భారత బౌలర్ శ్రీశాంత్.. త్వరలో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ సెప్టెంబరుతో అతడిపై నిషేధం ముగియనున్న నేపథ్యంలో రంజీల్లో కేరళ తరఫున బరిలోకి దిగనున్నాడు. అయితే ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాతే ఇతడిని జట్టులోకి తీసుకోనున్నారు.
2013 మే నెలలో ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్‌తో పాటు, రాజస్థాన్ రాయల్స్ జట్టులోని అజిత్ చండిలియా, అంకిత్ చవాన్‌లను అరెస్టు చేశారు. అనంతరం కేరళ పేసర్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి జీవితకాలం నిషేధం విధించింది. ఆ తర్వాత కోర్టులో బీసీసీఐతో శ్రీశాంత్ సుదీర్ఘ పోరాటం చేయడం వల్ల.. 2015లో దిల్లీ ప్రత్యేక కోర్టు అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది. శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధ నిర్ణయాన్ని 2018లో కేరళ హైకోర్టు కూడా కొట్టేసింది.