తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ మైలురాయిని చేరుకోవాలని ఉంది: మిథాలీ - మిథాలీ రాజ్​ 10వేల పరుగులు

నిలకడగా బ్యాటింగ్​ చేయడమే తన రహస్యమని చెబుతోంది భారత క్రికెట్​ మహిళా జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్​. వ్యక్తిగత రికార్డుల కంటే ప్రపంచకప్​లో భారత్​ను విజేతగా నిలపడమే తన చేరుకోవాలనుకున్న అసలైన మైలురాయని.. 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా మీడియాతో వెల్లడించింది.

Consistency key for me: Mithali after reaching 10,000 runs milestone
ఆ మైలురాయిని చేరుకోవాలని ఉంది: మిథాలీ

By

Published : Mar 12, 2021, 7:39 PM IST

క్రికెట్​లో ఎల్లప్పుడూ నిలకడగా రాణించడమే తన రహస్యమని అంటోంది భారత మహిళా క్రికెట్​ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్​. వ్యక్తిగత రికార్డులను కాకుండా.. ప్రపంచకప్​లో జట్టును విజేతగా నిలపాలనే మైలురాయిని చేరుకోవాలనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకొంది మిథాలి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో​ మాట్లాడింది.

"చాలాకాలంగా ఆడుతూ ఉంటే ఇలాంటి మైలురాళ్లను చేరుకోవచ్చు. నిలకడగా రాణించడమే నా ఆట రహస్యం. బ్యాటింగ్​కు వెళ్లినప్పుడల్లా.. వీలైనన్నీ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాను. ఇది దేశవాళీ టోర్నీలైనా.. అంతర్జాతీయ క్రికెట్​లోనైనా! నాకు బ్యాటింగ్​ ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి నేను చేసిన పరుగులే నా ఆటలో అనుభవాన్ని ఇచ్చాయి".

- మిథాలీ రాజ్​, భారత మహిళా క్రికెట్​ జట్టు కెప్టెన్​

"మహిళా క్రికెట్ స్థాయి పెరుగుతోంది. 150 పరుగుల నుంచి 250 రన్స్​ చేసే స్థాయికి వచ్చాం. ఆట మారే కొద్ది మనం మారాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా కెరీర్​లో మైలురాళ్లను చేరుకోవడం కంటే.. టీమ్ఇండియాకు ప్రపంచకప్​ అందిచాలనుకున్న మైలురాయిని చేరుకోవాలని ఉంది. ఒకవేళ కప్పు సాధిస్తే నా కెరీర్​లో అది ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది" అని మిథాలీ రాజ్​ చెప్పింది.

ఇదీ చూడండి:రికార్డ్​ అలర్ట్​: మిథాలీ పది వేల పరుగులు

ABOUT THE AUTHOR

...view details