భారత టీ20 జట్టులో మనీశ్ పాండేకి గత రెండేళ్లుగా చాలా తక్కువ అవకాశాలు వస్తున్నాడు. మైదానంలో చాలా వేగంగా కదిలే ఈ ఆటగాడు.. ప్రత్యర్థికి బ్యాట్‌తోనూ సమాధానం చెప్పగలడు. తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. నాలుగో టీ20లో టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు అర్ధశతకంతో రాణించాడు. అయితే ఇతడు భారత టీ20 జట్టుకు లక్కీ ఛార్మ్‌గా మారాడు. ఎందుకంటే గత రెండేళ్లలో ఇతడు తుది జట్టులో బరిలోకి దిగిన టీ20ల్లో భారత్‌కు ఓటమే లేదు.
గోల్డెన్ హ్యాండ్: పాండే ఉంటే ప్రత్యర్థికి పరాజయమే.. - manish pandey 19th win
భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్ల ప్రతిభకు కొదువలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో యువ క్రికెటర్లు ఒత్తిడి సమయంలోనూ అద్భుతంగా రాణించారు. అయితే టీమిండియాలో మనీశ్ పాండే మాత్రం లక్కీఛార్మ్గా మారాడు. ఎందుకంటే అతడు ఆడిన 19 టీ20ల్లో భారత్ ఎప్పుడూ ఓడిపోకపోవడం విశేషం.
గోల్డెన్ హ్యాండ్: పాండే ఉండే ప్రత్యర్థికి పరాజయమే..
న్యూజిలాండ్‌పై ఐదు టీ20ల సరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా... తొలసారి కివీస్ గడ్డపై పొట్టి ఫార్మాట్ టైటిల్ అందుకుంది. అయితే ఇందులో మనీశ్ పాత్ర కీలకంగా ఉంది. కీలక సమయంలో అద్భుతమైన క్యాచ్‌లతో మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. 2018 నుంచి న్యూజిలాండ్‌తో ఐదో టీ20 వరకూ భారత్ తరఫున మనీశ్ పాండే 19 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడగా.. అన్నింటిలోనూ టీమిండియానే గెలుపొందింది. అంతేకాకుండా చివరి ఏడు టీ20ల్లోనూ మనీశ్ నాటౌట్‌గా నిలవడం విశేషం.
Last Updated : Feb 28, 2020, 10:25 PM IST