అనివార్య కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్లో ఆడలేకపోయిన స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా.. చాలా రోజుల తర్వాత తిరిగి ప్రాక్టీసు మొదలుపెట్టాడు. వచ్చే దేశవాళీ సీజన్ కోసం సిద్ధమవుతున్నట్లు ట్వీట్ చేశాడు.
నెట్స్‌లో రైనా తీవ్ర సాధన.. వచ్చే ఐపీఎల్లో పక్కా! - IPL 2021news
రానున్న దేశవాళీ సీజన్ కోసం మాజీ క్రికెటర్ సురేశ్ రైనా రెడీ అవుతున్నాడు. అందులో భాగంగానే నెట్స్‌లో తీవ్రంగా సాధం చేస్తున్నాడు.
నెట్స్‌లో రైనా తీవ్ర సాధన.. వచ్చే ఐపీఎల్లో పక్కా!
ఈ ఏడాది ఆగస్టు 15న మాజీ కెప్టెన్ ధోనీతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 13వ సీజన్ కోసం యూఏఈకి వెళ్లిన సరే పలు కారణాలతో తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. ఒకవేళ చెన్నై సూపర్‌కింగ్స్ ఇతడిని వదులుకుంటే రాబోయే ఐపీఎల్ వేలంలోనూ రైనా ఉండే అవకాశముంది.
రానున్న జనవరిలో జరగబోయే ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తరప్రదేశ్ జట్టు తరఫున రైనా బరిలో దిగనున్నాడు. అందులో భాగంగానే నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీసు చేస్తూ కనిపించాడు.