తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు 'ఖేల్​రత్న' అవార్డు - స్పోర్ట్స్ అవార్డు వార్తలు

భారత స్టార్​ క్రికెటర్​ రోహిత్​ శర్మను ప్రఖ్యాత ఖేల్​ రత్న అవార్డు వరించింది. ఇషాంత్​ శర్మ, దీప్తి శర్మలు అర్జున పురస్కారానికి ఎంపికయ్యారు.

rohit
రోహిత్​

By

Published : Aug 21, 2020, 6:12 PM IST

Updated : Aug 21, 2020, 7:14 PM IST

భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్​ గాంధీ ఖేల్​రత్నకు టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్​ శర్మ ఎంపికయ్యాడు. అతనితో పాటు పారా అథ్లెట్​ మరియప్పన్​ తంగవేలు, టేబుల్​ టెన్నిస్​ ఛాంపియన్​ మనిక బత్రా, రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​, మహిళల హాకీ జట్టు కెప్టెన్​ రాణి రాంపాల్​ ఈ అవార్డును అందుకోనున్నారు.

మరోవైపు క్రికెటర్లు ఇషాంత్​ శర్మ, దీప్తి శర్మ, అథ్లెట్​ ద్యుతి చంద్​, షూటర్​ మను బాకర్​ సహా 27 మంది క్రీడాకారులు అర్జున అవార్డు సొంతం చేసుకోనున్నారు. వీటిని ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వర్చువల్ విధానంలో అందజేయనున్నారు.

రాజీవ్​ గాంధీ ఖేల్​ రత్న అవార్డు

  • రోహిత్​ శర్మ (క్రికెట్)
  • మరియప్పన్​ టి.(పారా అథ్లెట్​)
  • మనిక బత్రా(టేబుల్​ టెన్నిస్​)
  • వినేశ్​ ఫొగాట్(రెజ్లింగ్​)
  • రాణి రాంపాల్​(హాకీ)

ద్రోణాచార్య అవార్డు లైఫ్​ టైమ్​ కేటగిరీ

  • ధర్మేంద్ర తివారి(ఆర్చరీ)
  • పురుషోత్తం రాయ్​(అథ్లెటిక్స్​)
  • శివ్​ సింగ్​(బాక్సింగ్​)
  • రోమేశ్​ పథానియా (హాకీ)
  • క్రిషణ్​ కుమార్​ హుడా(కబడ్డీ)
  • విజయ్​ బాలచంద్ర మునీశ్వర్​(పారా పవర్​లిఫ్టింగ్​)
  • నరేశ్​ కుమార్​( టెన్నిస్​)
  • ఓం ప్రకాశ్​ దహియా(రెజ్లింగ్​)

అర్జునా అవార్డు

  • అతాను దాస్​(ఆర్చరీ)
  • ద్యుతి చంద్​(అథ్లెటిక్స్​)
  • సాత్విక్​ సాయిరాజ్​ రాంకిరెడ్డి(బ్యాడ్మింటన్​)
  • చిరాగ్​ చంద్రశేఖర్​ శెట్టి(బ్యాడ్మింటన్​)
  • వినేశ్​ భ్రిజువాన్షి(బాస్కెట్​ బాల్​)
  • మనీశ్​ కౌషిక్​(బాక్సింగ్​)
  • లవ్​లీనా బోర్గోయిన్​(బాక్సింగ్​)
  • ఇషాంత్​ శర్మ(క్రికెట్​)
  • దీప్తి శర్మ(క్రికెట్​)
  • సావంత్​ అజయ్​ అనంత్​(ఈక్వెస్ట్రియన్​)
  • సందేశ్​ ఘింజన్​(ఫుట్​బాల్​)
  • అదితి అశోక్​(గోల్ఫ్​)
  • అకాశ్​దీప్​ సింగ్​(హాకీ)
  • దీపికా(హాకీ)
  • దీపక్​(కబడ్డీ)
  • కాలి సారిక సుధాకర్​ (ఖోఖో)
  • దత్తు బాబన్​ భోకనల్​(రౌనింగ్​)
  • మను బాకర్​(షూటింగ్​)
  • సౌరభ్​ చౌదరి( షూటింగ్​)
  • మధురిక సుహాస్​ పట్​కర్​​(టేబుల్​ టెన్నిస్​)
  • దివిజ్​ శరణ్​(టెన్నిస్​)
  • శివ కేశవన్​(వింటర్​ స్టోర్స్​)
  • దివ్య కక్రన్​(రెజ్లింగ్​)
  • రాహుల్​ అవారె(రెజ్లింగ్​)
  • సుయాశ్​ నారాయన్​ జాదవ్​(పారా స్విమ్మింగ్​)
  • సందీప్​(పారా అథ్లెటిక్స్​)
  • మనీశ్​ నర్వాల్​(పారా షూటింగ్​)

ధ్యాన్​చంద్​ అవార్డు

  • కుల్దీప్​ సింగ్​ భుల్లార్​( అథ్లెటిక్స్​)
  • జిన్సీ ఫిలిప్స్​(అథ్లెటిక్స్​)
  • ప్రదీప్​ శ్రీక్రృష్ణ గాంధే( బ్యాడ్మింటన్​)
  • త్రుప్తి మురుగండే(బ్యాడ్మింటన్​)
  • ఎన్​. ఉష(బాక్సింగ్​)

​​

Last Updated : Aug 21, 2020, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details