టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వివాహంపై కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు తెరపడింది. గోవాలో మార్చి 14, 15 తేదీల్లో ఈ జంటకు పెళ్లిభాజాలు మోగనున్నాయి. మోడల్, టీవీ ప్రజెంటర్ సంజనా గణేశన్-బుమ్రా జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ విషయాన్ని యాక్టర్ తారా శర్మ సలుజా తన ఇన్స్టా పోస్టులో వెల్లడించింది.
"వివాహ బంధంతో త్వరలో ఒక్కటి కాబోతున్న బుమ్రా, సంజనా గణేశన్లకు శుభాకాంక్షలు" అంటూ సలుజా ఇన్స్టాలో పేర్కొంది.